¡Sorpréndeme!

Rishabh Pant Poor form 27Cr Auction price | IPL 2025 లో ఘోరంగా విఫలమవుతున్న పంత్ | ABP Desam

2025-04-02 0 Dailymotion

  రిషభ్ పంత్..దూకుడైన ఆటతీరుకు పెట్టింది పేరు. ఫార్మాట్ కు సంబంధం లేకుండా పంత్ చూపించే అగ్రెసివ్ నెస్...షాట్ల ఎంపికలో తనదైన శైలి ఇవన్నీ కలిసి 27ఏళ్ల పంత్ కు ఓ కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేసింది. అలాంటి పంత్ ఈ ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన వేలంలో ఏకంగా 27కోట్ల రూపాయల ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన వేలంధర పలికిన ఆటగాడిగా రికార్డులకెక్కిన పంత్...తనను కొన్న పైసలకు అస్సలు న్యాయం చేసే ఉద్దేశంలో లేన్నట్లుగా ఉన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడిన పంత్..కేవలం 17 పరుగులే చేయటం LSG జట్టును తీవ్రంగా నిరాశపరుస్తోంది. మొదటి మ్యాచ్ లో డకౌటైన పంత్ రెండో మ్యాచ్ లో 15 పరుగులు చేశాడు. మళ్లీ నిన్న రాత్రి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 2 పరుగులకే అవుటై తన పూర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. 2023 సీజన్  ఐపీఎల్ ను రోడ్ యాక్సిడెంట్ కారణంగా మిస్సైన రిషభ్ పంత్ గతేడాది కమ్ బ్యాక్ ఇవ్వటమే మూడు అర్థసెంచరీలు సాధించి 446 పరుగులు చేశాడు. కానీ ఈసారి మూడు మ్యాచులు పూర్తైనా పంత్ 17 పరుగులే చేయటం చూస్తుంటే తనకు ఈ సారి లక్ కలిసొస్తున్నట్లుగా లేదు. అసలే LSG ఓనర్ సంజీవ్ గోయెంకా టీమ్ కి సానుకూల ఫలితాలు రాకపోతే ఎంత పెద్ద ప్లేయరైనా గ్రౌండ్ లోనే పెట్టి నిలదీస్తాడు. గత సీజన్ లో కేఎల్ రాహుల్ మీద అరిస్తే అతను ఎంత లక్నోనే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అలాంటి 27 కోట్లు పెట్టిన కొనుక్కున్న తర్వాత పంత్ ఇలా సింగిల్ డిజిట్ స్కోర్లు చేస్తుంటే ఈ సీజన్ లోనే పంత్ ను పక్కనపెట్టినా ఆశ్చర్యం అస్సలు లేదు. వాళ్లకు సరిపడనుప్పుడు ధోని లాంటి ఆటగాడిని కూడా ఇబ్బంది పెట్టిన ఘనత గోయెంకా కు ఉంది. పంత్ ఇప్పటికైనా తన తప్పులు దిద్దుకుని ఫామ్ అందబుచ్చుకోకపోతే సంజీవ్ గోయెంకా నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి.